ఉద్యోగుల పింఛను పథకం 1995 (ఇపిఎస్- 95) కిందకు వచ్చే పింఛనుదారులందరూ పింఛను తీసుకోవడాన్ని కొనసాగించేందుకు జీవన ప్రమాణ పత్ర (జెపిపి)/ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను అందచేయవలసి ఉంటుంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో తమ ఇంటి సమీపంలోనే ఇపిఎస్ పింఛనుదారులు డిఎల్‌సిని సమర్పించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ ఒ) పలు ప్రత్యామ్నాయాల సౌలభ్యాన్ని కలుగ చేసింది. ఈ పద్ధతులు/ ఏజెన్సీల ద్వారా సమర్పించే జెపిపి సమానంగా చెల్లుబాటు అవుతుంది.
ఇపిఎఫ్ ఒ, ఇపిఎస్‌కు చెందిన 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు అదనంగా, పింఛనుదారులు తమకు ఫించను పంపిణీ చేసే బ్యాంకులు, సమీపంలో ఉన్న పోస్టాఫీసులలో డిఎల్‌సిని సమర్పించవచ్చు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల కామన్ సర్వీసెస్ సెంటర్ల (సిఎస్సి) నెట్‌వర్్క ద్వారా కూడా డిఎల్‌సిని సమర్పించవచ్చు. ఇవి కాకుండా, ఇపిఎస్ పింఛనుదారులు డిఎల్‌సిని ఉమంగ్ ఆప్ ద్వారా కూడా సమర్పించవచ్చు.
ఇటీవలి కాలంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ర(ఐపిపిబి) ఫించనుదారులకు ఇంటి గడపలోనే డిజిటల్ సర్టిఫికెట్ (డిఎల్‌సి) సేవలను ప్రారంభించింది. నామ మాత్రపు రుసుమును ఆన్లైన్లో చెల్లించడం ద్వారాఫించనుదారులు డిఎల్‌సి సేవలను పొందవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్‌కు చెందిన పోస్్టమాన్ పింఛనుదారు గృహానికి వచ్చి, వారి ఇంటిలోనే డిఎల్‌సిని జనరేట్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తాడు.
తాజా మార్గదర్శకాల ప్రకారం, పింఛనుదారులు తమ సౌలభ్యం ప్రకారం ఏడాదిలో ఏ సమయంలో అయినా డిఎల్‌సిని సమర్పించవచ్చు. డిఎల్‌సిని సమర్పించిన తేదీ నుంచి లైఫ్ సర్టిఫికెట్ ఏడాది కాలం చెల్లుతుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పిపిఒ) 2020లో జారీ అయిన పింఛనుదారులు ఒక ఏడాది పూర్తి అయ్యే వరకు జెపిపిని అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇపిఎస్ పింఛనుదారులు తమ డిఎల్‌సిని నవంబరు నెలలో సమర్పించవలసి ఉండేది. దీని కారణంగా పింఛనుదారులు పొడవైన క్యూలలో నిలబడడం, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు ఉండే సాధారణ రద్దీని ఎదుర్కోవలసి వచ్చేది.ఇపిఎస్ పింఛనుదారులకు ఎటువంటి ఆటంకాలు లేని సామాజిక భద్రతను పింఛనుదారులకు అందించేందుకు ఈ అనుకూలమైన చర్యను తీసుకోవడం జరిగింది.
కరోనా వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి పాలయ్యే అవకాశం సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ఉంటుంది.కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఇపిఎఫ్ో పింఛనుదారులకు మద్దతుగా సమయానికి పింఛను విడుదల చేస్తూ,వారి గడపకు సేవలను అందిస్తోంది. ఈ చొరవలు దాదాపు 67 లక్షలమంది ఇపిఎస్ పింఛనుదారులకు లబ్ధి చేకూరుస్తుంది.ఇందులో 21 లక్షల మంది భర్తను/ భార్యను కోల్పోయినవారు, పిల్లలు, అనాథ పెన్షనర్లు ఉన్నారు.
Home Uncategorized ఇపిఎస్ పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు బహుళ ప్రత్యామ్నాయాలను అందిస్తున్న ఇపిఎఫ్ ఒ